స్టార్ డైరక్టర్ ల వారసుల పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోల వారసులు మాత్రమే హీరోగా ఎంట్రీ ఇవ్వాలని రూలేమీ లేదు.. దర్శకులు, నిర్మాతలు, కమెడియన్ లు సైతం తమ వారసులను ఇండస్ట్రీలో హీరోలుగా చూడాలని ఆశించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటివరకు ఈ స్టార్ డైరెక్టర్ ల వారసులు సినీ ఇండస్ట్రీలో శాశ్వతంగా నిలదొక్కుకోలేక పోవడమే చింతించాల్సిన విషయం.. స్టార్ డైరెక్టర్లు రోజురోజుకు తమ ప్రతిభతో పాన్ ఇండియా సినిమాలు చేసే రేంజ్ కు ఎదుగుతుంటే వారి వారసులు మాత్రం ఒకటి రెండు సినిమాలకే పరిమితం అయి పోయి స్టార్ హీరో ఇమేజ్ను సంపాదించుకోలేక పోయారు.

మొదట్లో ఒకటి రెండు మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకుని.. ఆ తరువాత క్రమక్రమంగా అవకాశాలను కోల్పోతూ ప్రస్తుతం నేటి యువతకు వీరు ఎవరో కూడా తెలియని దుస్థితికి వచ్చారు అంటే వారు ఏ రేంజ్ లో సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకరత్న దాసరి నారాయణరావు వారసుడి నుంచి ఇవివి సత్యనారాయణ కొడుకు ల వరకు ప్రస్తుతం ఏ ఒక్కరు కూడా సినీ ఇండస్ట్రీలో కొనసాగక పోవడం గమనార్హం. ఇక ఆ స్టార్ డైరెక్టర్ ల వారసులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1.దాసరి నారాయణరావు – అరుణ్ కుమార్:
దర్శకరత్న గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు కూడా మంచి ఇమేజ్ సంపాదించి పెట్టారు. ఇక ఈయన కొడుకు అరుణ్ కుమార్ ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన మాత్రం హీరో గా నిలదొక్కుకోలేకపోయారు.

2.రాఘవేంద్రరావు – ప్రకాష్:
దర్శకేంద్రుడి గా గుర్తింపు తెచ్చుకున్న రాఘవేంద్రరావు ఎంతో మంది హీరోలకు, హీరోయిన్లకు మంచి ఇమేజ్ ను సంపాదించి పెట్టారు. కానీ ఆయన కొడుకు ప్రకాష్ మాత్రం ఇండస్ట్రీలో నటుడిగా ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు.

3.ఈవీవీ సత్యనారాయణ – అల్లరి నరేష్:
ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ లాంటి ఎంతో మంది స్టార్ హీరోలకు తన సినిమాలతో మంచి హోదాను కల్పించారు. ఇక ఆయన వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నరేష్ మాత్రం పెద్దగా సక్సెస్ ను పొందలేకపోయాడు. గత ఏడాది నాంది సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ప్రస్తుతం ఆయన సినిమాలలో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.