హీరోయిన్ ప్రేమ వలలో చిక్కిన టాప్ హీరో కొడుకు !

సౌత్ ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలో డిఫెరెంట్ క్యారక్టర్ లతో విక్రమ్ తనకంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకున్నాడు .కోలీవుడ్లో పెద్ద‌ స్టార్ల‌లో ఒక‌డైన విక్ర‌మ్,త‌న‌యుడీ ధృవ్ విక్రమ్ కు హీరోగా లైఫ్ ఇచ్చిన బాలా ద‌ర్శ‌క‌త్వంలో త‌న కొడుకును హీరోగా ప‌రిచ‌యం చేయాల‌న్న విక్ర‌మ్ ,అర్జున్ రెడ్డి రీమేక్‌ను ఆయ‌న చేతుల్లో పెడితే సినిమా పూర్త‌య్యాక దాని ప్రోమోలు చూసి సినిమా తీసిన విధానం నచ్చక తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆ వెర్ష‌న్ మొత్తం తీసిపడేసి,అర్జున్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గిరీశ‌య్య‌తో మ‌ళ్లీ సినిమా తీయించి ఆదిత్య వ‌ర్మ పేరుతో రిలీజ్ చేసాడు విక్రమ్ ..ఆ సినిమా కూడా ఓ మోస్త‌రుగా ఆడి పర్వాలేదు అనిపించుకుంది . ఇప్పుడు ధ్రువ్.. త‌న తండ్రి విక్రమ్తో క‌లిసి మ‌హాన్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఐతే ఇప్పుడు సినిమాల‌కు సంబంధించిన విష‌యంతో కాకుండా ధృవ్ పర్సనల్ వ్య‌వ‌హారంతో ధ్రువ్ కోలీవుడ్ వార్త‌ల్లోకి వ‌చ్చాడు.

అర్జున్ రెడ్డి రీమేక్ అయిన ఆదిత్య వ‌ర్మ‌లో క‌థానాయిక‌గా న‌టించిన బాలీవుడ్ భామ బానిత సంధుతో అత‌ను ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదేమీ పుకారు కాదు ఆధారాలతో దొరుకుతునాడు ధృవ్ . తన మొదటి సినిమా ఆదిత్య వ‌ర్మ విడుద‌లై రెండేళ్లు అయిన కూడా వీళ్లిద్ద‌రూ ఇప్ప‌టికీ చాలా క్లోజ్‌గా క‌నిపిస్తుండ‌టం.. ఇద్ద‌రూ క‌లిసి ఫారిన్ టూర్‌కు కూడా వెళ్ల‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమాయ‌ణం న‌డుస్తోంద‌ని బ‌లంగా వార్త‌లొస్తున్నాయి.

అసలు వ్యవహారం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే తాజాగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ధ్రువ్, బానిత క‌లిసి దుబాయ్‌కి వెళ్లారు. అక్క‌డే బుర్జ్ ఖలీఫాకు ద‌గ్గ‌ర్లో ఒక హోట‌ల్లో ఉండి నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు చేసుకున్నారు. హోట‌ల్ గ‌ది నుంచి బానిత బుర్జ్ ఖ‌లీఫాను చూస్తున్న వీడియోను ధ్రువ్‌యే స్వ‌యంగా రికార్డ్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూసి వారంతా ధ్రువ్, బానిత ప్రేమ‌లో ఉన్న‌ట్లే అని అంద‌రూ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. అయితే విక్రమ్ ఇంతవరకు ధృవ్ ప్రేమపై ఎలాంటి కామెంట్ చేయలేదు . బానిత ఆదిత్య వ‌ర్మ త‌ర్వాత త‌మిళంలో సినిమాలేవీ చేయ‌లేదు. ఇటీవ‌ల బాలీవుడ్ లో విక్కీ కౌశల్ మూవీ స‌ర్దార్ ఉద్ద‌మ్‌లో ఆమె క‌నిపించింది.ఈ ప్రేమాయణం పెళ్లి వరకు వెళుతుందో ..లేక మధ్యలో ఆగిపోతుంది కొంత కాలం వరకు వేచి చూడాలి .

Share post:

Latest