నాని దెబ్బ‌కు వెన‌క్కి త‌గ్గిన వ‌రుణ్ తేజ్‌..నిరాశ‌లో మెగా ఫ్యాన్స్‌!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం `గ‌ని`. కిరణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ నిర్మించారు. ఈ చిత్రంలో వ‌రుణ్‌కి జోడీగా సాయి మంజ్రేకర్ న‌టించ‌గా.. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి త‌దిత‌ర‌లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మొద‌ట‌ డిసెంబర్ 3నే విడుదల చేయ‌ల‌నుకున్నారు. కానీ, అదే స‌మ‌యంలో బాల‌య్య న‌టించిన అఖండ బ‌రిలోకి దిగ‌డంతో.. గ‌ని చిత్రాన్ని డిసెంబర్ 24కు వాయిదా వేశారు. అయితే ఇప్పుడు అదే తేదీన నాని న‌టించిన `శ్యామ్ సింగ్ రాయ్‌` చిత్రం రిలీజ్ కాబోతోంది.

రాహుల్‌ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామా చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాతో పోటీ ప‌డ‌లేక.. నాని దెబ్బ‌కు మ‌ళ్లీ వ‌రుణ్ తేజ్ వెన‌క్కి త‌గ్గాడు. తాజాగా గ‌ని చిత్రాన్ని వాయిదా వేస్తున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. `కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే సినిమా రంగం కోలుకుంటోంది. రాబోయే వారాల్లో మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి.

ఈ తరుణంలో పోటీ అంత మంచిది కాదు. అందుకే మా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తాం.` అని ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. దీంతో గ‌ని వాయిదాపై మెగా ఫ్యాన్స్ నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, బాక్సింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తమన్ సంగీతం అందించాడు.

Share post:

Popular