`పుష్ప‌` ఐటెం సాంగ్‌పై కాపీ మ‌ర‌క‌లు..నెటిజ‌న్లు ట్రోల్స్!

December 11, 2021 at 8:17 am

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. సునీల్‌, అన‌సూయ‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి భాగం పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబ‌ర్ 17న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్న మేక‌ర్స్‌.. తాజాగా ఈ సినిమాలోని `ఊ అంటవా మావ.. ఊఊ అంటావా మావ‌` అంటూ సాగే మాస్ మసాలా ఐటెం సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్‌లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత న‌టించింది.

దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించిన ఆ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించ‌గా, ఇంద్రావతి చౌహాన్‌ మాస్‌ వాయిస్‌తో ఆలపించారు. మాస్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్న ఈ సాంగ్‌ విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే భారీ వ్యూస్ ద‌క్కించుకుంది. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, ఇప్పుడీ సాంగ్‌పై కాపీ మ‌ర‌క‌లు ప‌డ్డాయి.

సూర్య హీరోగా నటించిన `వీడొక్కడే` సినిమాలోని `హానీ.. హానీ` పాటలా పుష్ప ఐటెం సాంగ్ ఉందని నెట్టిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ రెండు సాంగ్స్ మ్యూజిక్ ఒకేలాగా ఉన్నాయ‌ని, పుష్ప ఐటెం సాంగ్ కాపీ అని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. దీంతో ఇప్పుడీ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి దీనిపై పుష్ప టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

`పుష్ప‌` ఐటెం సాంగ్‌పై కాపీ మ‌ర‌క‌లు..నెటిజ‌న్లు ట్రోల్స్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts