దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత దేశానికి చెందిన విశ్వసుందరి టైటిల్ ను హర్నాజ్ సంధు గెలుచుకుంది. భారతదేశానికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించింది. ఇకపోతే ఈమె విశ్వ సుందరి కిరీటాన్ని పొందిన తరువాత ఆశ్చర్యపోయే బహుమతులను కూడా సొంతం చేసుకోవడం గమనార్హం. 2021 సంవత్సరానికి గాను మిస్ యూనివర్స్ టైటిల్ ను సొంతం చేసుకున్న హర్నాజ్ సంధు వజ్రాలు పొదిగిన కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ కిరీటాన్ని 18 క్యారెట్స్ గోల్డ్ తో 1770 వజ్రాలతో పొదిగిన మధ్యలో ఉన్న వజ్రాన్ని షీల్డ్ కట్ గోల్డ్ కనారీ డిమాండ్ తో తయారు చేశారు. భారత కరెన్సీ ప్రకారం 37 కోట్ల రూపాయలు.
రూ.1.8 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ బహుమతిగా ఇచ్చారని సమాచారం. న్యూయార్క్లో ఒక సంవత్సరం పాటు బసచేయడానికి మిస్ యూనివర్స్ అపార్ట్మెంట్ ను కూడా ఇచ్చారు. కాదు సంవత్సరం పాటు ఆమె అందంగా కనిపించడానికి కావలసిన మేకప్ ఐటమ్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, ఫుడ్ ఐటమ్స్, డ్రెస్సెస్, మేకప్ ఆర్టిస్ట్ ,ఫోటోగ్రాఫర్స్ ఇలా ప్రతిదీ కూడా బెస్ట్ గా ఉండే విధంగా ఒక సంవత్సరం పాటు ఆమెకు ఉచితంగా ఇవ్వనున్నారు. ఒక సంవత్సరం పాటు ట్రావెల్ అలవెన్సు కూడా ఆమెకు ఉచితంగా ఇవ్వనున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆమెకు నచ్చిన హోటల్స్ లో స్టే చేయడానికి అనుమతి ఇచ్చారు. ఈమె మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తర్వాత కొన్ని బాధ్యతలను కూడా నెరవేర్చాల్సి ఉంటుంది. ఏవైనా ఫంక్షన్లకు, చారిటీ ట్రస్ట్, సేవా సంఘాలకు కూడా వెళ్లి వాటిని ఉచితంగా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది