ప్ర‌భాస్ రిజెక్ట్ చేసిన ఆ చిత్ర‌మే గోపీచంద్ కెరీర్‌ను మార్చింద‌ని మీకు తెలుసా?

గోపీచంద్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దివంగ‌త ద‌ర్శ‌కుడు టి.కృష్ణ త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన గోపీచంద్‌.. `తొలి వలపు` సినిమా ద్వారా హీరోగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యాడు. కానీ, ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. దాంతో చాలా రోజులు ఖాళీగానే ఉన్న గోపీచంద్‌కి తేజ తెరకెక్కించిన జయం సినిమాలో విలన్‌గా న‌టించే అవ‌కాశం వ‌చ్చింది.

దాంతో ఏమీ ఆలోచించ‌కుండా జ‌యంలో విల‌న్‌గా న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఈ సినిమా త‌ర్వాత గోపీచంద్‌కు విల‌న్ ఆఫ‌ర్లే రావ‌డంతో.. వ‌ర‌స‌గా ఆయ‌న నిజం, వ‌ర్షం చిత్రాల్లో ప్ర‌తినాయ‌కుడిగా న‌టించి మంచి గుర్తింపు పొందాడు. ఇక అలాంటి స‌మ‌యంలో గోపీచంద్ కెరీర్‌ను మార్చిన చిత్రం `యజ్ఞం`.

ఎ. ఎస్. రవి కుమార్ చౌదరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలోనే గోపీచంద్ మ‌ళ్లీ హీరోగా మారాడు. ఈతరం ఫిలింస్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌మైన ఈ చిత్రం 2004 జూలై 2న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి నిర్మాత‌ల‌కు కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ చిత్రం త‌ర్వాత గోపీచంద్ హీరోగా అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్నారు.

అయితే ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. యజ్ఞం చిత్రాన్ని డైరెక్ట‌ర్ రవి కుమార్ చౌదరి ప్ర‌భాస్‌తో తీయాల‌ని అనుకున్నార‌ట‌. ప్ర‌భాస్‌కు క‌థ కూడా వినిపించ‌గా.. ఆయ‌న ప‌లు కార‌ణాల వ‌ల్ల రిజెక్ట్ చేశార‌ట‌. దాంతో నిర్మాత పోకూరి బాబూరావు గోపీచంద్‌ను హీరోగా సూచించ‌గా.. అందుకు డైరెక్ట‌ర్ ఓకే చెప్పి ఆయ‌న‌తోనే సినిమా తీసి భారీ విజ‌యం సాధించారు. మొత్తానికి ప్ర‌భాస్ రిజెక్ట్ చేసిన యజ్ఞం చిత్రం గోపీచంద్ కెరీర్‌కు ట‌ర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.