గోపీచంద్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. దివంగత దర్శకుడు టి.కృష్ణ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన గోపీచంద్.. `తొలి వలపు` సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. కానీ, ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో చాలా రోజులు ఖాళీగానే ఉన్న గోపీచంద్‌కి తేజ తెరకెక్కించిన జయం సినిమాలో విలన్‌గా నటించే అవకాశం వచ్చింది. దాంతో ఏమీ ఆలోచించకుండా జయంలో విలన్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా తర్వాత […]