`అఖండ‌`కు శ్రీ‌కాంత్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే మైండ్‌బ్లాకే?!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `అఖండ‌`. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

- Advertisement -

ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌డుతున్న ఈ మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రంలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ద రాజులుగా క్రూర‌మైన పాత్రలో శ్రీ‌కాంత్ అద్భుతంగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. ముఖ్యంగా బాలకృష్ణ, శ్రీకాంత్‌ మధ్య వచ్చే సీన్స్‌ అదరిపోతాయి.

మొత్తానికి విల‌న్‌గా మంచి మార్కుల‌నే వేయించుకున్న శ్రీ‌కాంత్‌.. రెమ్యూన‌రేష‌న్ కూడా భారీగానే పుచ్చుకున్నాడ‌ట‌. వినిపిస్తున్న లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. అఖండ చిత్రానికి గానూ రూ.1.5 కోట్లను పారితోష‌కంగా పుచ్చుకున్నాడ‌ని తెలుస్తోంది. ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియ‌దు గానీ.. ఈ విష‌యం మాత్రం నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.

కాగా, ఈ సినిమాలో బాలకృష్ణ తనదైన నటనతో విజృంభించాడు. సినిమా మొత్తం బాలకృష్ణ వన్‌మేన్‌ షో అనే చెప్పాలి. గ్రామ పెద్ద మురళీ కృష్ణగా, అఖండగా రెండు విభిన్న పాత్రలో కనిపించిన అద‌ర‌గొట్టేశాడు. మ‌రోవైపు త‌మ‌న్ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమా హిట్ అవ్వ‌డానికి ఓ కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు.

 

Share post:

Popular