రానా బర్త్ డే: సాయంత్రం 4.05 గంటలకు ‘భీమ్లా’ సర్ప్రైజ్..!

December 14, 2021 at 12:25 pm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ భీమ్లా నాయక్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. దీంతో ఈ సినిమాను నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్ గ్లింప్స్, రానా గ్లింప్స్, టీజర్, సాంగ్స్ సెన్సేషన్ సృష్టించాయి. దీంతో ఈ మూవీపై అంచనాలు కూడా పెరిగిపోయాయి.

కాగా ఇవాళ రానా పుట్టినరోజు సందర్భంగా భీమ్లా నాయక్ సినిమా నుంచి మరో సర్ప్రైజ్ రానుంది. సాయంత్రం 4:05 గంటలకు సర్ప్రైజ్ వున్నట్లు ఈ మూవీ మేకర్స్ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ లో రానా లుక్ కూడా అదిరిపోయింది. సిగరెట్ వెలిగిస్తూ రానా మాస్ లుక్ లో ఆకట్టుకున్నారు.

కాగా సంక్రాంతి సందర్భంగా ఈసారి అగ్రహీరోలు నటించిన సినిమాలన్నీ విడుదల అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ భారీగా నెలకొంది. జనవరి ఏడవ తేదీన రాజమౌళి-ఎన్టీఆర్ -రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఆర్ఆర్ఆర్, 14వ తేదీన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ విడుదల కానుంది. రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య విడుదల అవుతున్నప్పటికీ భీమ్లా నాయక్ పై అటు ట్రేడ్ లో ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

 

రానా బర్త్ డే: సాయంత్రం 4.05 గంటలకు ‘భీమ్లా’ సర్ప్రైజ్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts