షాకింగ్ న్యూస్‌..బిగ్‌బాస్ నుంచి ఆ కంటెస్టెంట్ ఔట్‌..!

బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షోకు పేరొందిన బిగ్‌బాస్ సీజ‌న్ 5 ముంగింపు మ‌రో రెండు రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. డిసెంబర్‌ 19న ఫైన‌ల్ ఎపిసోడ్ ఎపిసోడ్ జ‌ర‌గ‌బోతుండ‌గా.. అందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయిపోయాయి. మొత్తం 19 మంది కంటెస్టెంట్ల‌తో ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేత వర్మ, ప్రియ‌, లోబో, విశ్వ‌, జెస్సీ, యానీ మాస్ట‌ర్‌, యాంక‌ర్ ర‌వి, ప్రియంకా, కాజ‌ల్ ఇలా వ‌ర‌స‌గా ఎనిమినేట్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఫైన‌ల్స్‌కి శ్రీ‌రామ్‌, ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, స‌న్నీ, సిరి, మాన‌స్‌లు చేరుకోగా.. ఇప్పుడు ఈ ఐదుగురులో నుంచి ఒక‌రు అనూహ్యంగా బ్యాగ్ స‌ద్దేశారు. ఇంత‌కీ ఆ కంటెస్టెంట్ ఎవ‌రో కాదు సిరి. ఈ విష‌యాన్ని బిగ్ బాస్ ప్రోమో ద్వారా తెలిజ‌య‌జేశాడు. ఈ వీడియోలో సిరి ఎలిమినేట్ అయింద‌ని బిగ్ బాస్ ప్ర‌క‌టించ‌డంతో.. ఆమె తీవ్ర ఆవేద‌నకు గురైంది.

బిగ్ బాస్ హౌస్‌ను, ముఖ్యంగా షణ్నూని వదిలి వెళ్లలేక సిరి బాగా ఎమోషనల్‌ అయ్యింది. ఇక సిరి హౌస్ నుంచి వెళ్లిపోయాక‌.. ష‌ణ్ముఖ్ ఒంటరిగా కూర్చొని దుఖ సాగ‌రంలో మునిగిపోయాడు. మ‌రి సిరి నిజంగా ఎలిమినేట్ అయిందా..? లేదా షోపై హైప్ క్రియేట్ చేసేందుకు కావాల‌నే బిగ్ బాస్ అలా చేశాడా..? అన్న‌ది తెలియాలంటే మ‌రి కొన్ని గంట‌లు వెయిట్ చేయాల్సిందే.

కాగా, ఈ సారి బిగ్ బాస్ ట్రోపిని గెలుచుకోబోయే విజేత‌కు రూ. 50 ల‌క్ష‌లు ప్రైజ్ మ‌నీతో పాటు సొంత ఇంటిని కట్టుకునేందుకు షాద్‌నగర్‌లోని సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల స్థలాన్ని సైతం ఇవ్వ‌బోతున్నారు. దీంతో ట్రోపీని సొంతం చేసుకోబోయే విన్న‌ర్ ఎవ‌రా అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Share post:

Latest