అదిరిపోయిన `శ్యామ్ సింగ‌రాయ్‌` ట్రైల‌ర్..చూస్తే గూస్ బాంప్సే!

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా రాహుల్‌ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన‌ ఈ సినిమాలో సాయి పల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. రెండు టైమ్ పీరియడ్స్‌లో సాగే ఈ చిత్రంలో నాని శ్యామ్‌సింగ రాయ్‌, వాసు అనే రెండు విభిన్న పాత్రల‌ను పోషిస్తున్నాడు. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిద్దుకున్న ఈ మూవీకి మిక్కీ జె. మేయర్ సంగీతమందించాడు.

ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 24న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేప‌థ్యంలో జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్న‌ మూవీ మేర‌క్స్‌.. వరంగల్ లో కాకతీయ యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో `రాయల్ ఈవెంట్` నిర్వ‌హించి తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ ప్ర‌స్తుతం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది.

‘ఐ యామ్ వాసు.. ఫిమేల్ డైరెక్టర్.. సాఫ్ట్ వేర్ జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాను’ అంటూ నాని చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైల‌ర్ ఆద్యంతం అల‌రించింది. డైరెక్ట‌ర్ అయ్యేందుకు కృతి శెట్టితో షార్ట్ ఫిల్మ్స్ తీయ‌డం, ఈ క్ర‌మంలోనే ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌టం ట్రైల‌ర్‌లో చూపించారు. ఆ తరువాత శ్యామ్ సింగరాయ్ క్యారెక్టర్ ని పరిచయం చేశారు. ప్రజల కోసం పోరాడుతూ.. దేవదాసి(సాయిప‌ల్ల‌వి)తో ప్రేమలో పడే క్యారెక్టర్ అది.

`పిరికివాళ్లే కర్మ సిద్ధాంతాన్నే మాట్లాడతారు.. ఆత్మాభిమానం కన్నా ఏ ఆగమాం గోప్పది కాదు… తప్పని తెలిసాక.. దేవుడ్ని కూడా ఏదిరించడంలో తప్పు లేదు అని శ్యామ్ సింగ‌రాయ్ సాయి ప‌ల్ల‌వితో చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. మ‌రి ఇంతకీ సినిమా డైరెక్టర్ కావాలనుకున్న వాసుకు.. ఎప్పుడో దేవదాసీ వ్యవస్థపై కోల్కత్తాలో తిరుగు బాటు చేసిన శ్యామ్ సింగ రాయ్ కున్న సంబంధం ఏంటీ? అన్న‌దే ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇక అటు శ్యామ్ సింగ‌రాయ్‌గానూ, ఇటు వాసుగానూ నాని ఒదిగిపోయిన‌న తీరు ఆకట్టుకుంటోంది. ముగ్గురు హీరోయిన్లూ ట్రైల‌ర్‌లో ప్ర‌త్యేక ఆకర్షణగా నిలిచారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌, విజువ‌ల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఫైన‌ల్‌గా గూస్ బాంప్స్ తెప్పిస్తున్న‌ శ్యామ్ సింగ్‌రాయ్ ట్రైల‌ర్ అదిరిపోయింది. మ‌రి లేటెందుకు మీరూ ట్రైల‌ర్‌పై ఓ లుక్కేసేయండి.

 

Share post:

Latest