`శ్యామ్ సింగ‌రాయ్‌`పై బిగ్ అప్డేట్‌..రేపు నాని ఫ్యాన్స్‌కి పండ‌గే!!

న్యాచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తాజా చిత్రమే `శ్యామ్ సింగ‌రాయ్‌`. రాహుల్‌ సాంకృత్యన్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 24న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాంబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మూవీ మేక‌ర్స్‌.. తాజాగా ఓ బిగ్ అప్డేట్‌ను అనౌన్స్ చేశారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ సినిమా ట్రైల‌ర్‌ను రేపు విడుద‌ల చేయ‌బోతున్నారు.

రేపు సాయంత్రం 5 గంటలకు వరంగల్‌లోని హన్మకొండలోని కాకతీయయూనివర్సిటీ కాలేజ్ గ్రౌండ్‌లో శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ శ్యామ్ సింగరాయ్ నుంచి లేటేస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో రేపు నాని ఫ్యాన్స్‌కి పండ‌గే అని అంటున్నారు నెటిజ‌న్లు.

కాగా, శ్యామ్ సింగరాయ్ కథ రెండు టైమ్ పీరియడ్స్‌కు సంబంధించింది. గతం, వ‌ర్త‌మానం అంటూ రెండు భాగాల్లో ఈ క‌థ‌ జరుగుతుంది. అలాగే నాని శ్యామ్‌సింగ రాయ్‌, వాసు అనే రెండు విభిన్న పాత్రల‌ను పోషిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, సాంగ్స్‌, టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేయ‌గా.. రేపు విడుద‌ల కాబోయే ట్రైల‌ర్ ఏ మేర‌కు హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Share post:

Latest