ఆ సీనియ‌ర్ హీరోతో బాల‌య్య వార్‌.. మ్యాట‌ర్ తెలిస్తే పిచ్చెక్కిపోతారు?

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అర్జున్‌తో న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వార్‌కు దిగ‌బోతున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వేంటి..? అస‌లు ఏం జ‌రిగింది..? వంటి విష‌యాలు తెలియాలంటే ఏ మాత్రం లేట్ చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోవాల్సిందే. అఖండ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను ఖాతాలో వేసుకుని మాంచి జోరు మీద ఉన్న బాల‌య్య‌.. త‌న తదుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మ‌లినేనితో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

`ఎన్‌బీకే 107` వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది. పుల్ మాస్ మసాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండ‌గా.. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌లె పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది.

అయితే పిచ్చెక్కించే మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ చిత్రంలో బాల‌య్య‌తో ఢీ కొట్టే విల‌న్ పాత్ర‌లో యాక్ష‌న్ హీరో అర్జున్ క‌నిపించ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని.. త్వ‌ర‌లోనే ఈ విష‌యాన్ని అధికార‌కంగా తెల‌ప‌బోతున్నార‌ని స‌మాచారం.

కాగా, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ సినీ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన అర్జున్.. నితిన్ హీరోగా చేసిన లై, విశాల్ మూవీ అభిమన్యుడు చిత్రాల్లో విల‌న్‌గా న‌టించి బాగా ఆక‌ట్టుకున్నారు. అలాగే ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కుతున్న `స‌ర్కారు వారి పాట‌`లోనూ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇక తాజాగా ఈయ‌న‌కు బాల‌య్య సినిమాలోనూ విల‌న్ ఛాన్స్ వ‌చ్చింద‌ని టాక్‌. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే చిత్ర‌యూనిట్ నుంచి ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

Share post:

Latest