కొన్నాళ్లపాటు ప్రేమించుకుని ఆ తర్వాత వివాహం చేసుకున్నారు సమంత, అక్కినేని నాగ చైతన్య. చక్కగా సాగుతున్న వారి సంసారం లో ఏం జరిగిందో తెలియదు గానీ.. అనుకోకుండా ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విడాకులు తీసుకున్న వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.
నాగ చైతన్య హైదరాబాద్ లో ఉంటుండగా, సమంత ఎక్కువగా తన సొంతూరు అయిన చెన్నై లో ఉంటుంది. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన సమంత జీవితానికి సంబంధించి ఏదో ఒక అంశంపై రోజూ ఏదో ఒక కామెంట్ చేస్తూ వస్తోంది. ఇవాళ సమంత విడాకుల పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారింది.
నాగచైతన్య తో విడిపోయిన తర్వాత తొలిసారి సమంత విడాకులపై స్పందించింది. ‘ నేను విడాకులు తీసుకున్నప్పుడు కుంగిపోయి చనిపోతానని అనుకున్నా. నేను చాలా బలహీనమైన వ్యక్తి ని అని నా ఫీలింగ్. కానీ నేను ఇప్పుడు ఎంత బలంగా ఉన్నానో తెలుసుకొని ఆశ్చర్యపోతున్నా. నేను ఇంత దృఢంగా ఉంటానని అనుకోలేదు.’ అని ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత పేర్కొంది. కాగా ప్రస్తుతం సమంత విడాకుల తర్వాత వరుసగా సినిమాలు అంగీకరిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం, పుష్ప సినిమాలో ఒక ఐటెం సాంగ్ తో పాటు మరో కొత్త ప్రాజెక్టు చేసేందుకు సమంత అంగీకారం తెలిపింది. అలాగే హాలీవుడ్లో అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.