గతం గతః.. ఇక విడాకుల మ్యాటర్ పై మాట్లాడను.. సమంత కామెంట్స్..!

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత ఉన్నట్లుండి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. అంత సన్నిహితంగా మెలిగిన జంట విడిపోవడం ఏంటి..అని అనుకున్నారు. ఇక నాగచైతన్య, సమంత ఫ్యాన్స్ అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు.

ఆ తర్వాత సమంత తీరు వల్లే విషయం విడాకుల వరకు వెళ్లిందనీ ఆమెపై ట్రోల్స్ కూడా వచ్చాయి. విడాకుల ప్రకటన తర్వాత సమంత తనకు జరిగిన అన్యాయంపై పరోక్షంగా పలు సందర్భాల్లో ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. విడాకులకు కారణం తానేనని..తప్పు తనదేనని.. ట్రోల్స్ రావడం తనను ఎంతో బాధించిందని సమంత పేర్కొంది.

విడాకుల తర్వాత తాను చనిపోతానేమోనని భావించినట్లు వెల్లడించింది. అయితే తాజాగా సమంత తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో సమంత తెలిపింది. ఇప్పటివరకు విడాకులపై పలుమార్లు స్పందించానని.. ఇకపై ఆ ప్రస్తావన తీసుకురాకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.

విడాకుల తర్వాత ఒత్తిడి ఎలా ఎదుర్కొన్నారని.. అడిగిన ప్రశ్నకు సమంత స్పందిస్తూ.. విడాకులపై ఇప్పటికే చాలా మాట్లాడాను. ఇక మళ్ళీ మళ్లీ చెప్పాలనుకోవట్లేదు’ అని సమంత సమాధానం ఇచ్చింది. సమంత విడాకుల తర్వాత వరుసగా సినిమాలను అంగీకరిస్తూ బిజీగా ఉంటోంది.

Share post:

Latest