టాలీవుడ్ మన్మధుడు, సీనియర్ హీరో నాగార్జున గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైనప్పటికీ.. సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్ను దక్కించుకుని టాలీవుడ్లో టాప్ హీరోగా ఎదిగాడు. ఇక ఆరు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తున్న నాగ్.. మరోవైపు నిర్మాతగా సత్తా చాటుతున్నారు.
అటువంటి వ్యక్తి ఈ సినిమా కారణంగా మద్యానికి బానిసగా మారరు. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు `దేవదాస్`. న్యాచురల్ స్టార్ నాని, నాగార్జున కలిసి నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటించారు.
2018లో విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో ఎల్లప్పుడు మందు తాగుతూనే రౌడీగా కనిపించే నాగార్జున.. ఏకంగా సినిమా షూటింగ్ లేకపోయినా సాయంత్రం సెట్లో మందు తాగడానికి అలవాటు పడ్డారు. సినిమా మొత్తం మందు తాగే పాత్ర కావడంతో.. నాగ్ పూర్తిగా మద్యానికి బానిస అయ్యారట.
అయితే ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత నాగార్జున తనని తాను కంట్రోల్ చేసుకొని ఎలాగోలా ఆ వ్యసనం నుంచి బయట పడ్డారట. ఈ విషయాన్ని గతంలో ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం నాగార్జున తనయుడు నాగ చైతన్యతో కలిసి `బంగ్రారాజు` చిత్రం చేస్తున్నాడు. అలాగే మరోవైపు బిగ్ బాస్ సీజన్ 5కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.