‘సామి సామి..’ కోసం ర‌ష్మిక ఎన్ని గంట‌లు క‌ష్ట‌ప‌డిందో తెలిస్తే షాకే!

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా.. ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `పుష్ప‌` ఒక‌టి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో మ‌ల‌యాళ న‌టుడు ఫహాద్‌ ఫాజిల్, సునీల్‌ విల‌న్లుగా క‌నిపించ‌బోతుండ‌గా.. అన‌సూయ కీల‌క పాత్ర పోషిస్తోంది.

అలాగే రెండు భాగాలుగా ఈ పాన్ ఇండియా చిత్రం రాబోతుండ‌గా.. మొద‌టి భాగాన్ని `పుష్ప ది రైస్‌` పేరుతో డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర యూనిట్‌.. వ‌రుస‌గా ఒక్కో అప్డేట్‌ను వ‌దులుతూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే మేక‌ర్స్ ఈ మ‌ధ్య `సామి సామి..` సాంగ్‌ను విడుద‌ల చేశారు. `నువ్వు అమ్మి అమ్మి అంటాంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ.. నిను సామీ సామీ అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామీ` అంటూ సాగే ఈ పాట యూత్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటూ యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌ను కొల్ల‌గొట్టేస్తోంది.

అయితే ఈ సాంగ్ కోసం ర‌ష్మిక ఎంతో క‌ష్ట‌ప‌డింద‌ట‌. డాన్స్ చేయ‌డంలో అల్లు అర్జున్‌కు ఓ గ్రేస్‌ ఉంటుంది. ఆ గ్రేస్‌ను మ్యాచ్ చేయాలంటే ఖ‌చ్చితంగా ఆయ‌న‌కు జోడీగా న‌టించే వారు ఎంతో క‌ష్ట‌ప‌డాలి. ఈ నేప‌థ్యంలోనే సామి సామి సాంగ్ కోసం ర‌ష్మిక ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా 18 గంట‌ల పాటు ప్రాక్టీస్ చేసింద‌ట‌. అప్ప‌టికి కానీ ఆమెకు ప‌ర్‌ఫెక్ష‌న్ రాలేద‌ట‌.

 

Share post:

Latest