టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిచగా.. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా కనిపించబోతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే.
అయితే మొదటి భాగం `పుష్ప ది రైజ్` డిసెంబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రష్మిక మందన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
అలాగే ఈ ఇంటర్వ్యూలో `పుష్ప కథ గురించి వినగానే మీరు ఏమనుకున్నారు` అని యాంకర్ ప్రశ్నించగా.. అసలు పుష్ప కథ పూర్తిగా తనకు తెలియదంటూ షాకిచ్చింది రష్మిక. `సుకుమార్ గారు పూర్తిగా కథ చెప్పలేదు. నా పాత్ర ప్రాధాన్యత గురించి మాత్రమే చెప్పారు. ఆయన పట్ల ఉన్న నమ్మకంతో ఈ సినిమాకు ఓకే చెప్పాను.
అయితే షూటింగ్ జరుగుతున్నప్పుడు నా పాత్ర విషయంలో నాకు సంతృప్తి పెరుగుతూ వచ్చింది తప్ప తగ్గలేదు.` అని రష్మిక ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అలాగే `ఫస్టు పార్టు పూర్తవుతోందంటే ఎంతో బాధగా ఉంది. అదే సమయంలో రెండవ భాగం ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆత్రుతగా ఉంది` అంటూ ఆమె పేర్కొంది. దీంతో రష్మిక వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.