మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మెగా పవర్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. హీరోగానే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగానూ దూసుకుపోతున్న చరణ్.. ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటించాడన్న సంగతి తెలిసిందే.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14 భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి చరణ్, ఎన్టీఆర్, ఆలియాభట్‌లతో కలిసి తాజాగా హాస్య నటుడు కపిల్‌శర్మ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న `ది కపిల్ శర్మ షో` గెస్ట్‌లుగా విళ్లారు. ఈ షోలో కలిప్ ఆర్ఆర్ఆర్ టీమ్‌ను నాన్‌స్టాప్‌గా నవ్వించాడు.
అయితే సరదాగా నవ్విస్తూనే..వెరైటీ ప్రశ్నలకు ఆర్ఆర్ఆర్ టీమ్ దగ్గర నుంచి కపిల్ సమాధానాలు రాబట్టాడు. ఈ క్రమంలోనే కపిల్‌శర్మ రామ్‌చరణ్‌ను మీకు ఏరోప్లేన్ కంపెనీ, హోటళ్లు, ఆసుపత్రులు ఇలా చాలా వ్యాపారాలు ఉన్నాయంట కదా.. అంత డబ్బుండి హాయిగా రెస్ట్ తీసుకోకుండా..ఎందుకిలా సినిమాలు, ప్రమోషన్‌లు అంటూ పరుగులు పెడుతున్నారని ప్రశ్నించాడు.
అందుకు రామ్ చరణ్.. `నాకేమి ఎయిర్‌లైన్స్ కంపెనీ లేదు.. అదే ఉంటే ఈ షోకి నేనెందుకు వస్తాను. ఇక డబ్బులు లేవు..అందుకే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నా` అంటూ నవ్వుతూ కూల్‌గా సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
https://youtu.be/EIxtEqjWBoo