గోవాలో చైతు చేసిన ప‌నికి షాకైన ఫ్యాన్స్‌..అస‌లేమైందో తెలుసా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన అక్కినేని నాగ చైత‌న్య‌.. అనతి కాలంలోనే త‌నదైన టాలెంట్‌తో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న చైతు.. ఇటీవ‌లె భార్య‌, ప్ర‌ముఖ హీరోయిన్ స‌మంత‌కు విడాకులు ఇచ్చేసిన సంగ‌తి తెలిసిందే.

చై-సామ్‌లు ఎందుకు విడిపోయారో తెలియ‌దుగానీ.. వీరి బ్రేక‌ప్ మ్యాట‌ర్ మాత్రం సంచ‌ల‌నం సృష్టించింది. వీరిద్ద‌రిపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు కూడా తెర‌పైకి వ‌చ్చాయి. కానీ, అవేమి ప‌ట్టించుకోకుండా వీరిద్ద‌రూ ఎవ‌రి లైఫ్‌లో వారు బిజీగా మారారు. ఇక‌పోతే తాజాగా గోవాకు వెళ్లిన చైతు.. అక్క‌డ ఓ క‌పుల్ ఫ్యాన్స్‌కి ఊహించ‌ని షాక్ ఇచ్చాడు.

అస‌లేమైందంటే.. ఇటీవల హాలీడే కోసం గోవా వెళ్లిన చైతు.. అక్క‌డో హోట‌ల్‌లో డిన్న‌ర్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడ ఉన్న ఓ జంట చైతును చూసి హీరో అని గుర్తు ప‌ట్టారు. దాంతో వెంట‌నే ఆ క‌పుల్ ఫ్యాన్స్‌ చైతు వ‌ద్ద‌కు వెళ్లి సెల్ఫీ కోర‌గా.. ఆయ‌న వెంట‌నే ఓకే చెప్పార‌ట‌. దీంతో వారిలో ఒకరు సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించార‌ట‌.

అయితే వారు తీస్తోన్న ఫోటోలో కపుల్స్‌ సరిగ్గా కనిపించకపోవడాన్ని గమనించిన చైతు.. వెంటనే ఫోన్‌ తీసుకొని నేను తీస్తాను, అప్పుడు మీరు బాగా కనిపిస్తారంటూ సెల్ఫీ తీసి ఆ జంటకు ఫోన్‌ ఇచ్చేశార‌ట‌. ఈ విష‌యాన్ని మొత్తం స‌ద‌రు జంట సోష‌ల్ మీడియా ద్వారా పేర్కొంటూ చైతుపై ప్ర‌శంస‌లు కురిపించారు. చైతూ మంచితనం గురించి విన్నాం. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాం. నిజంగా చైతన్య డౌన్‌ టూ ఎర్త్‌ అంటూ స‌ద‌రు క‌పుల్ ఫ్యాన్స్ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. దీంతో ఇప్పుడీ మ్యాట‌ర్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

https://www.instagram.com/p/CX-MHN9o9f-/?utm_source=ig_web_copy_link