మహేష్..డైరెక్టర్ క్రిష్..శివమ్ మూవీ ఆగిపోవడానికి కారణం..!

సూపర్ స్టార్ మహేష్ బాబుతో, స్టార్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్లో ఒక సినిమా అప్పట్లో చేయబోతున్నారనే వార్త వినిపించింది. ఇక ఆ సినిమా పేరు శివమ్.ఇక ఈ సినిమా చాలా కొత్త కథ ఉంటుందని, మహేష్ ఫ్యాన్స్ సూపర్ ట్రీట్ ఉండబోతోందనే హంగామా చేశారు. ఇక ఈ సినిమా గురించి రాజమౌళి కూడా శివమ్ కథ నాకు తెలుసని చాలా అద్భుతంగా ఉంది రాజమౌళి అప్పట్లో తెలియజేయడం జరిగింది.

అయితే మరి ఏమైందో తెలియదు కానీ ఈ సినిమా ఆగిపోయింది. క్రిస్ చెప్పిన కథకు మహేష్ ముందు ఓకే చెప్పిన.. ఫైనల్ స్క్రిప్ట్ విషయంలో మహేష్ ను కన్విన్స్ చేయడంలో కృషి సక్సెస్ కాలేకపోయాడన్నట్లుగా సమాచారం. ఆ సమయంలోనే ఆ కథను పక్కన పెట్టి హీరో రానా తో ఒక సినిమా చేశాడు క్రిష్. అలా అప్పుడు ఆగిపోయిన వీరిద్దరి కాంబినేషన్ ఇక ఇప్పటి వరకు ఆ సినిమా ఊసే లేదు.

కథానాయకుడు, మహా నాయకుడు, కొండపొలం సినిమాలతో నిరాశపరిచిన క్రిష్.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.