క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. పుష్ప మూవీ ప్రమోషన్స్ సమయంలో సుకుమార్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. ఇప్పటికే సుకుమార్-చరణ్ కాంబోలో వచ్చిన `రంగస్థలం` చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. వీరి తదుపరి ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే తాజాగా ఈ సినిమా గురించి దర్శకధీరుడు రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి వరసగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి.. సుకుమార్-రామ్ చరణ్ సినిమా గురించి మాట్లాడారు. చరణ్‌తో సుకుమార్ తీయబోయే సినిమా కథ నాకు తెలుసు. ఆ సినిమాలో ఓపెనింగ్ సీన్ కూడా తనకు తెలుసంటూ బాంబ్ పెల్చారు రాజమౌళి. అయితే కథ లీక్ చేయను.. చేస్తే సుకుమార్‌కు హార్ట్ ఎటాక్ వస్తుందనరి సరదగా కౌంటర్ వేశాడు.
అంతే కాదు, తను చూసిన, విన్న బెస్ట్ ఓపెనింగ్ సీన్స్ లో ఒకటిగా అది నిలిచిపోతుందని, అది ఎంతో హర్డ్ హిట్టింగ్‌గా ఉంటుందని, ఆ సీన్ చూసి ప్రేక్షకులు పిచ్చెక్కిపోతారని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇక జక్కన్న వ్యాఖ్యలతో సుక్కూ, చరణ్‌ల సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది.