ఆర్ఆర్ఆర్ బయోపిక్ కాదు.. పూర్తిగా ఫిక్షన్.. రాజమౌళి క్లారిటీ..!

ఆర్ఆర్ఆర్ నుంచి పాటలు, టీజర్, ట్రైలర్ ఒక్కొక్కటిగా వస్తున్నప్పటినుంచి ఈ సినిమాపై వివిధ రకాల ఊహాగానాలు, విమర్శలు చెలరేగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ఇంతకు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల బయోపిక్ నా కాదా.. మహనీయులకు పాట పెట్టి స్టెప్పులు వేయించడం ఏంటి.. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. వాటన్నిటికీ ఇవాళ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.

‘ ఆర్ఆర్ఆర్ బయోపిక్ కానే కాదు.. ఇది దేశ భక్తి సినిమా అసలు కాదు. సినిమా ప్రారంభ సమయంలో ఇదే చెప్పా. ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నా. ఇద్దరు మహనీయుల మధ్య స్నేహం గురించి మాత్రమే ఈ సినిమా ఉంటుంది. ఇద్దరు మహనీయులు ఒకచోట కలిస్తే.. వారిద్దరి మధ్య స్నేహం.. చిగురిస్తే ఎలా ఉంటుందో ఊహించుకుని తీసిన సినిమా ఇది.

ఈ కథ పూర్తిగా కల్పితం. ఇందులో అల్లూరి సీతారామరాజు కానీ.. కొమరం భీం పాత్రకు సంబంధించిగాని ఎటువంటి యదార్థ సంఘటన లో ఉండవు. ఇద్దరు మహనీయులు కలసి స్టెప్పులు వేస్తే విమర్శలు వస్తాయని ముందే ఊహించాం. సినిమా విడుదలైన తర్వాత ఇందుకు సమాధానం దొరుకుతుంది. రామ్ చరణ్ నాలుగు గుద్దులు, ఎన్టీఆర్ రెండు తన్నులు.. అని గిరిగీసుకుని సినిమా తీయలేదు. కానీ ఇద్దరు హీరోల ఇమేజ్ బ్యాలెన్స్ చేసుకొని మూవీ తీసాం’ అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.