`రాధేశ్యామ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేట్ లాక్‌..చీఫ్ గెస్ట్ ఎవ‌రో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కృష్ణం రాజు సమర్పణలో గోపీ కృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద, భూషణ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మించారు.

ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగుతో స‌హా మొత్తం ఏడు భాష‌ల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు తక్కువ సమయం ఉండడంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్ర యూనిట్‌.. పోస్టర్లు, టీజర్‌, పాటలు ఇలా ఒక్కోటి వ‌దులుతూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.

ఇక ఇప్పుడు రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కూడా డేట్ లాక్ చేసింది. డిసెంబర్ 23న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఈవెంట్‌ను ఎంతో గ్రాండ్‌గా నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఈవెంట్‌కు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్ర‌ములు సైతం చీఫ్ గెస్ట్‌లు రానున్నార‌ని స‌మాచారం. మ‌రి వారెవ‌రెవ‌రో తెలియాలంటే మ‌రి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా, వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్యగా ప్ర‌త్యేకమైన క్యారెక్ట‌రైజేష‌న్ లో కనిపించబోతున్నారు. అలాగే ఈయ‌న ప్రేయ‌సి ప్రేర‌ణ పాత్ర‌లో పూజా హెగ్డే మెర‌వ‌బోతుండ‌గా.. కృష్ణం రాజు, భాగ్యశ్రీ, సచిన్‌ కేడ్కర్‌ తదితరులు ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు.

Share post:

Latest