పుష్ప సినిమాకు షాక్ ఇస్తున్న ట్విట్టర్ టాక్..!

అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ పుష్ప. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. పుష్ప సినిమా ఎలా ఉంది అనే విషయమై యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సినిమా చూసిన వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. థియేటర్ల వద్ద నుంచి బయటకు వచ్చిన అభిమానులు మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉందని బ్లాక్ బస్టర్ అని మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని పొగడ్తలు కురిపిస్తున్నారు.

అయితే ట్విట్టర్ ద్వారా ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా చూసిన వాళ్లు తమ అభిప్రాయాలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో చాలామంది ఫస్టాఫ్ చాలా బాగుందని, సెకండాఫ్ డల్ అని, క్లైమాక్స్ వీక్ గా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ పాటలు అద్భుతంగా ఉన్నప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిగా అందించలేకపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. సినిమా నిడివి కూడా మరీ ఎక్కువైందని అభిప్రాయపడుతున్నారు.

రంగస్థలం సినిమాలో మాదిరిగా సుకుమార్ మార్క్ మిస్ అయ్యిందని, అల్లు అర్జున్ కోసం ఒకసారి చూడవచ్చని మరికొందరు అభిప్రాయ పడ్డారు. మెజారిటీ నెటిజెన్స్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కోసం ఈ సినిమా చూడొచ్చని అంటున్నారు. మరి పుష్ప రేంజ్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.