వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటూ టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా గురించి పొందిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇప్పుడు నిర్మాతగా మారి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోనే ఓ సినిమాను నిర్మించబోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న పవర్ కళ్యాణ్ తాజాగా మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు.
సముద్ర ఖని దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘వినోదయ సీతమ్’. సముద్ర ఖని సదరు సినిమాను డైరెక్ట్ చేస్తూనే తంబి రామయ్యతో కలిసి నటించారు. అక్టోబర్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి రీమేక్ చేయాలి పవన్ భావిస్తున్నాడట. ఒరిజినల్‌కి దర్శకత్వం వహించిన సముద్ర ఖనినే రీమేక్‌ను తెరకెక్కించనున్నాడట.
అలాగే ఈ సినిమా స్క్రిప్ట్ తో పాటు నిర్మాణ బాధ్యతలను త్రివిక్రమ్ చూసుకోబోతున్నాడట. త్రివిక్రమ్ యొక్క ఫార్చూన్ ఫోర్ సినిమాస్, రామ్ తల్లూరి యొక్క ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మితం కానుందట. అంతే కాదు, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి బిగ్ అనౌన్స్‌మెంట్ కూడా బయటకు రానుందని టాక్.
ఇక పవన్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో `భీమ్లానాయక్`, క్రిష్ దర్శకత్వంలో `హరిహర వీరమల్లు` చిత్రాలను చేస్తున్నాడు. ఈ రెండు పూర్తి అయ్యాక హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయాల్సి ఉంది. వీటన్నిటి తర్వాత వినోదయ సీతమ్ రీమేక్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.