`ఆర్ఆర్ఆర్‌`కు బిగ్ షాక్‌.. అయోమ‌యంలో రాజ‌మౌళి..?!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన తాజా చిత్రం `రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భ‌ట్‌, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించారు. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుకంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల కాబోతోంది.

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో క‌లిసి జోరు జోరుగా ప్రచార కార్య‌క్ర‌మాల‌ను నిర్విస్తున్నారు. అయితే ఇలాంటి త‌రుణంలో ఆర్ఆర్ఆర్‌కు బిగ్ షాక్ త‌గిలింది. ప్ర‌స్తుతం క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌పంచ‌దేశాల్ల వేగంగా విస్త‌రిస్తున్న విష‌యం తెలిసిందే. భార‌త్‌లోనూ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరిగి పోతుండ‌డంతో.. ప్రభుత్వాలు మళ్లీ కఠినమైన ఆంక్షల వైపు అడుగులు వేస్తున్నాయి.

ఇప్ప‌టికే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉండ‌గా.. తాజాగా మహారాష్ట్ర ప్ర‌భుత్వం కూడా రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు వెల్ల‌డించింది. అలాగే జిమ్, స్పా, హోటల్, సినిమా హాళ్లలో 50 శాతం కెపాసిటీకే అనుమతి ఇచ్చారు. దీంతో పాన్ ఇండియా సినిమాలకు ఒమిక్రాన్ గుబులు ప‌ట్టుకుంది.

ఈ లిస్ట్‌లో మొద‌ట ఉన్నదే ఆర్ఆర్ఆర్ చిత్రమే. వాస్త‌వానికి పాన్ ఇండియా చిత్రాల‌కు హిందీ నుంచే మేజర్ షేర్ వ‌స్తుంది. కానీ, ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లో నైట్ కర్ఫ్యూ విధించారు. మ‌రియు థియేట‌ర్స్‌కు కూడా 50 పర్సెంట్ ఆక్యుపెన్సీనే ఉంది. ఈ రెండు అంశాలు ఆర్ఆర్ఆర్ క‌లెక్ష‌న్స్‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేయ‌బోతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఏం చేయాలో అర్థంగాక రాజ‌మౌళి అయోమ‌యంలో ప‌డ్డార‌ని అంటున్నారు. మ‌రి ఒక‌వేళ ఒమిక్రామ‌న్ మ‌రింత పుంజుకుంటే ఆర్ఆర్ఆర్ వాయిదా ప‌డినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని కూడా అంటున్నారు.

 

Share post:

Latest