ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఇప్పటి వరకు టీజర్, ట్రైలర్, లిరికల్ వీడియో సాంగ్స్, భీమ్ ఫర్ రామ్, రామ్ ఫర్ భీమ్, ఇంకా మేకింగ్ వీడియోస్ ఇలా ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్నో వీడియోస్ బయటకు వచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ టీం గట్టిగా ప్రమోషన్స్ కూడా చేస్తోంది.
అయితే ఎక్కడ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఒలీవియా మోరిస్ కనిపించడం లేదు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ కు జోడీగా అలియాభట్, ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి అలియాభట్, ఒలీవియా మోరిస్ స్పెషల్ లుక్ పోస్టర్ కూడా సినిమా ప్రారంభమైన కొత్త లో విడుదల చేశారు.
అయితే టీజర్, ట్రైలర్ లో మిగతా మేకింగ్ వీడియోల్లో అలియాభట్ కనిపించింది. ప్రస్తుతం ప్రమోషన్లలో కూడా ఈమె పాల్గొంటోంది. అయితే ఒలీవియా మోరిస్ ప్రస్తావన ఎక్కడా రావడం లేదు. ఇద్దరు మహనీయులకు సంబంధించిన కథతో తెరకెక్కుతున్న ఆర్ఆర్ ఆర్ లో హీరోయిన్లకు అంతగా స్పేస్ లేదని తెలుస్తోంది. అలియా భట్ పాత్ర కూడా 15 నిమిషాలకు మించి ఉండదని అంటున్నారు.
ఇక ఒలీవియా మోరిస్ పాత్ర అంతకుమించి తక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. అందువల్లే ట్రైలర్, టీజర్ లో ఆమెను చూపించలేదు. ఒకవేళ ఒలీవియా ప్రమోషన్స్ కు రావాలన్న ఆమె అబ్రాడ్ నుంచి రావాల్సి ఉంది. అంత అవసరం లేకపోవడంతో ఆమెను ఇంత దూరం ప్రమోషన్లకు పిలవలేదని తెలుస్తోంది. ఒలీవియా కేవలం నాటు.. నాటు వీడియో సాంగ్ లో ఒక చోట మాత్రమే కొద్ది సెకండ్ల పాటు కనిపించింది.