రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. నాలుగు పదుల వయసులోనూ పెళ్లి ఊసే ఎత్తడం లేదు. గత పదేళ్ల నుంచి ఈయన పెళ్లి గురించి రకరకాల వార్తలు వచ్చినా.. అవేమి నిజం కాలేదు. అభిమానులతో పాటుగా సినీ తారలు కూడా ప్రభాస్ పెళ్లి అప్‌డేట్ కోసం యమ ఆతృతగా ఎదురు చూస్తారు. కానీ, ఆ శుభ తరుణం మాత్రం రావడం లేదు.
ప్రభాస్ ఇన్ని రోజులైనా పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం వరుస సినిమాలే అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు మరో ప్రచారం తెర మీదకు వచ్చింది. ప్రభాస్ క్షత్రియ కులానికి చెందిన వారన్న సంగతి తెలిసిందే. అందు వల్ల ప్రభాస్ వారి కులానికి చెందిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు వారి కులస్తుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి పెడుతున్నారట.
ఈ నేపథ్యంలోనే తమ కులానికి చెందిన అమ్మాయిల కోసం వెతుకుతున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభాస్‌కి నచ్చిన అమ్మాయి దొరకలేదట. అందు కారణంగానే ప్రభాస్ పెళ్లి ఆలస్యం అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
కాగా, ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే ఈయన నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మరోవైపు ఈయన ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్`, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్-కె` చిత్రాలు చేస్తున్నాడు.