టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో నిర్మించారు. రెండు భాగాలుగా ఈ పాన్ ఇండియా చిత్రం రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప.. ది రైజ్` విడుదలకు ముస్తాబవుతోంది.
డిసెంబర్ 17న ఈ చిత్రంలో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్.. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చిత్రంపై ఉన్న అంచనాల్ని మరింత పెంచేలా ఉంది. పాత్రలను తీర్చిదిద్దిన తీరు, అడవి నేపథ్యంలో సాగే సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
దీంతో ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అయింది. అయితే మరోవైపు పుష్ప ట్రైలర్‌పై నెగటివ్ టాక్ కూడా వచ్చింది. ట్రైలర్ అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయిందని, పాన్ ఇండియా రేంజ్‌లో లేదని పలువురు పెదవి విరిచారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బన్నీ అభిమానుల్లో ఒక అమ్మాయి డైరెక్టర్ సుకుమార్‌కు వార్నింగ్ ఇస్తూ షాకింగ్ ట్విట్ చేశాడు.
`గుడ్ బై టూ ట్విట్టర్.. ట్రైలర్ చూసి నా మనసు చచ్చిపోయింది.. ఇంక నా వల్ల కాదు.. ఇన్ని రోజులు మీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి ట్వీట్ వేశాను సుకుమార్ సర్.. పుష్ప మూవీ ఏమైనా తేడా కొడితే ఫస్ట్ డే నే నా చావు చూస్తారు.. దేవుడి మీద, అమ్మ మీద ఒట్టు` అని ఏడుస్తున్న ఎమోజీ, దండం పెడుతున్న ఎమోజీలను షేర్ చేసింది. దీంతో ఇప్పుడామె ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. మరి దీనిపై పుష్ప టీమ్ ఏమని స్పందిస్తుందో చూడాలి.
https://twitter.com/Sruthi__143/status/1468221240951201795?s=20