టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా మెరవగా.. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, ప్రముఖ టాలీవుడ్ నటుడు సునీల్ విలన్లుగా నటించారు. యాంకర్ అనసూయ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. టాక్ ఎలా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ దిగ్గజ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే పుష్ప ది రైజ్ వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో లోకి వచ్చేస్తుందని గత రెండు రోజుల నుంచీ జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఎటువంటి నిజమూ లేదు. ఆమెజాన్‌తో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం.. పుష్ప థియేటర్స్‌లో విడుదలైన నాలుగు లేదా ఆరు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందట. దీనిపై ఇప్పటికే పుష్ప నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.