తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరువవుతోంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం ఏడుగురు మాత్రమే మిగిలి ఉండగా.. వీరందరూ ఫినాలేలో చోటు దక్కించుకోవడం కోసం తీవ్రంగా కృషి చేశారు. అయితే చివరకు శ్రీరామ్ విజయం సాధించి ఫినాలేలో అడుగుపెట్టాడు.
ఇక ఫైనల్ ఎపిసోడ్‌కు మరో రెండు వారాలే ఉండటంతో.. అభిమానులు మరియు బుల్లితెర నటులు తమకు ఇష్టమైన కంటెస్టెంట్‌ను గెలిపించాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. అలాగే బిగ్‌బాస్ కంటెస్టెంట్ల కోసం టాలీవుడ్ సెలబ్రెటీలు సైతం రంగంలోకి దిగుతున్నారు. తాజాగా రవితేజ హీరోగా వచ్చిన `నేల టికెట్`, రామ్ హీరోగా వచ్చిన `రెడ్` సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న మాళవిక శర్మ.. మానస్‌కి మద్దతు పలికింది.
`మానస్ గురించి నేను చాలా విన్నాను. అతడు బిగ్‌బాస్ హౌస్‌లో ఇరగదీస్తున్నాడు. అందరూ అతడికి ఓటేస్తున్నారని ఆశిస్తున్నాను. నా ఓటు కూడా మానస్‌కే! అతడు తప్పకుండా గెలుస్తాడని కోరుకుంటున్నాను` అని అతడిని ఆకాశానికి ఎత్తేస్తూ మాళవిక సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టింది. దీంతో ఇప్పుడామె పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా, ఈ వారం షణ్ముఖ్, సన్నీ మినహా శ్రీరామ్, సిరి, మానస్, ప్రియాంక, కాజల్ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో శ్రీరామ్, మానస్‌లు భారీ ఓటింగ్‌తో దూసుకుపోతున్నారు. మిగిలిందల్లా సిరి, కాజల్, ప్రియాంక. ఈ ముగ్గురిలోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంటున్నారు.
https://www.instagram.com/reel/CW–48WpqpT/?utm_source=ig_web_copy_link