`లైగర్` ఫ‌స్ట్ గ్లింప్స్ వ‌చ్చేసింది.. రౌడీ బాయ్ అద‌ర‌గొట్టేశాడుగా!

రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `లైగ‌ర్‌`. బాలీవుడ్ భామ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతాతో కలిసి పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌ నిర్మిస్తున్నారు. బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌టైసన్‌ ఓ కీలక పాత్రలో క‌నిపించ‌బోతున్నారు.

వచ్చే ఏడాది ఆగస్ట్‌ 25న విడుద‌ల కానున్న ఈ సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ గ్లిమ్ప్స్‌ను మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేశారు. ముంబై లో ఛాయ్ వాలా గా జీవనం సాగించే వ్యక్తి ఎలా బక్సార్ గా ఎదిగాడన్నది ఈ గ్లింప్స్ లో చూపించారు.

అలాగే 53 సెకండ్ల పాటు సాగిన ఈ గ్లింప్స్ లో విజయ్ దేవరకొండ ప‌వ‌ర్ ఫుల్‌ ఎంట్రీ, డైలాగ్స్‌, పూరీ మార్క్ యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఆక‌ట్టుకున్నాయి. స‌న్నివేశానికి తగ్గట్టుగా ఉన్న బాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై హైప్ ని పెంచేస్తోంది. మొత్తానికి అదిరిపోయిన‌ ఈ ఫ‌స్ట్ గ్లింప్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో పాటు లైగ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది.

కాగా, బాక్సింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌తో పాటు పూరి ఫ్యాన్స్ సైతం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Share post:

Latest