ప్రస్తుతం ఇప్పుడు ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా..RRR ఈ సినిమా బాహుబలి తర్వాత అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి నుంచి వస్తున్న తర్వాత భారీ బడ్జెట్ చిత్రం ఇది. దీనిపై భారీ అంచనాలు సర్వత్రా నెలకొన్నాయి. దీనికి తోడుగా టాలీవుడ్లో స్టార్ హీరోలైన, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తుండడం గమనార్హం.ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ పనుల్లో చాలా బిజీ అయ్యారు చిత్ర మేకర్స్.. అందులో భాగంగానే ఈ సినిమా కి RRR టైటిల్ ఎలా వచ్చింది అనే దానిపై రాజమౌళి ఒక ప్రశ్న ఎదురైందట.. అయితే ఈ సినిమా మొదట్లో ఏం టైటిల్ పెట్టాలో తెలియక అర్థం కాలేదని అన్నారు.. కానీ ఎన్టీఆర్, రామ్ చరణ్, శ్రీకృష్ణ కు తండ్రి రాజమౌళి పేర్లు కలిసి వచ్చేలా ఈ ప్రాజెక్టుని RRR అని పిలవాలనుకున్నారట.. అలా..#RRR అనే హ్యాష్ ట్యాగ్ తోనే అప్డేట్ చేశామని చెప్పుకొచ్చారు. అలా అలా ఆ అప్లోడ్ చేయడంతో దీనికి మంచి రెస్పాన్స్ వచ్చిందని అందుచేతనే ఈ సినిమా పేరు అలాగే ఫిక్స్ అయ్యారు అని తెలియజేశారు.
ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించగా నిర్మాతగా డివివి దానయ్య వ్యవహరించారు. ఇందులో మరికొంత మంది నటినటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.