బిగ్‌బాస్ నుంచి సైడైన నాగ్‌.. సీజ‌న్‌ 6 హోస్ట్ ఎవ‌రో తెలిస్తే షాకే!?

బుల్లితెర‌పై సూప‌ర్ పాపుల‌ర్ అయిన బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ షో ఫ‌స్ట్ సీజ‌న్‌కి ఎన్టీఆర్, సెకెండ్ సీజ‌న్‌కి నాని హోస్ట్‌లుగా వ్య‌వ‌హ‌రించ‌గా.. ఆ త‌ర్వాత మూడు సీజ‌న్ల‌కు కింగ్ నాగార్జున వ్యాక్యాత‌గా వ్య‌వ‌హ‌రించి ప్రేక్ష‌కుల‌ను ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేశారు.

ఇక సాధారణంగా ఒక సీజన్‌ అయిపోగానే కొత్త సీజన్‌ స్టార్ట్‌ అవ్వడానికి ఐదారు నెలలు పడుతుంది. కానీ ఈసారి మాత్రం బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ఎక్క‌వ టైమ్ తీసుకోవ‌డం లేదు. సీజ‌న్ 6ను కొత్త సంవత్సరం మొదలైన రెండు నెలలకే అంటూ మార్చి లేదా ఏప్రిల్‌లోనే ప్రారంభం కాబోతోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా నాగార్జున‌నే తెలియ‌జేశారు.

అయితే ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. బిగ్‌బాస్ సీజ‌న్ 6కి హోస్ట్ నాగార్జున కాద‌ట‌. ఆయ‌న ఈ సారి బిగ్‌బాస్ నుంచి సైడ‌వుతున్నారు. మ‌రి ఇంత‌కీ సీజ‌న్ 6 హోస్ట్ ఎవ‌రో తెలుసా..? న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌. ప్ర‌స్తుతం బాల‌య్య ఆహాలో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` షోకు హోస్ట్‌గా అద‌ర‌గొట్టేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ షో ద్వారా ఆహాకు భారీగా స‌బ్‌స్క్రైబ‌ర్లు వ‌చ్చిప‌డుతున్నారు.

అలాగే బయట ఏదైనా వేదికలెక్కినా.. ఇంకెక్కడైనా బాలయ్య మాట్లాడ్డానికి ఎంత తడబడతాడో తెలిసిందే. కానీ `అన్ స్టాపబుల్` షోలో మాత్రం తడబాటే లేకుండా ఎంతో కూల్‌గా మాట్లాడుతూ స‌ర‌దాగా హోస్ట్ చేస్తున్నారాయ‌న‌. ఈ నేప‌థ్యంలోనే బిగ్‌బాస్ నిర్వాహ‌కులు సీజ‌న్ 6కు బాల‌య్య‌ను హోస్ట్‌గా దింపాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. బాల‌య్య బిగ్‌బాస్ షోకి హోస్ట్ చేస్తే.. టీఆర్పీ భారీగా కూడా పెరుగుతుంది. అందుకే ప్ర‌స్తుతం ఆయ‌న‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట‌.

Share post:

Latest