నరేంద్రమోడీతో మెగా కోడ‌లు చ‌ర్చ‌లు..కార‌ణం అదేనట‌..!

మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ ఉపాస‌న కొణిదెల గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓవైపు అపోలో ఆసుపత్రి బాధ్యతలను చూసుకుంటూనే.. మరోవైపు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాల‌ను చేప‌డుతూ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తుంటుంది. అలాగే సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉపాస‌న‌..ఫిట్‏నెస్, ఆయుర్వేద వైద్యం, జంతువుల సంరక్షణ వంటి విష‌యాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తుంటుంది.

ఇదిలా ఉంటే.. ఉపాస‌న తాజాగా దేశ ప్ర‌ధాని న‌రేంద్రమోడీతో స‌మావేశం అయ్యారు. ఇండియన్ ఎక్స్‌పో 2020లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆమె కలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా తీసిన కొన్ని ఫొటోల‌ను ఉపాస‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేస్తూ.. `ఇండియన్ ఎక్స్‌పో- 2020లో భాగంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నాను.

ఆవిష్కరణ, ఆరోగ్య సంరక్షణ చర్యలను మరింత మెరుగుపర్చడం, మహిళా సాధికారత, సంస్కృతి పరిరక్షణ మీద దృష్టిసారించడం అనేవి అద్భుతమైన అంశాలు. అలాగే సాంకేతికత శక్తి మనకు ఎన్నో అవకాశాలను ఇస్తుంది. మనం వాటిని తెలివిగా, సమర్థంగా ఉపయోగించుకోవాలి` అంటూ రాసుకొచ్చింది. అలాగే ఈ ఎక్స్‌పో కార్యక్రమంలో ఎన్నెన్నో కొత్త విష‌యాలు ఉన్నాయి. మీ మీ పిల్లలను అక్కడికి తీసుకెళ్లండి అంటూ ఉపాస‌న సూచించింది. దీంతో ఇప్పుడు ఆమె పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

https://www.instagram.com/p/CXyRfPkl-Do/?utm_source=ig_web_copy_link