కరోనా తగ్గుముఖం పట్టడం చేత.. థియేటర్లలో బాగా సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే వరుస సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా బాక్సాఫీసు వద్ద అఖండ పుష్ప వంటి సినిమాలు మంచి సక్సెస్ను అందుకున్నాయి. ఇక ఈ క్రమంలోనే క్రిస్మస్ పండుగ సందర్భంగా మరికొన్ని సినిమాలు ఈ వారం విడుదల కాబోతున్న ట్లు తెలుస్తోంది. ఇప్పుడు వాటి గురించి మనం చూద్దాం.క్రిస్మస్ కానుకగా థియేటర్, ఓటీటీ లో విడుదల కాబోతున్న సినిమాలు
1). శ్యామ్ సింగరాయ్:
హీరో నాని, ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇక హీరోయిన్ గా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నది. ఈ మూవీ ఈ నెల 24న విడుదల కానుంది.
2). 83 మూవీ:
కపిల్ దేవ్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణ్వీర్ సింగ్, దీపిక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా డిసెంబర్ 24న విడుదల కాబోతోంది.
3). గూడుపుఠాని:
కమెడియన్ సప్తగిరి ఇ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు ఇందులో హీరోయిన్ గా నేహా సోలంకి నటిస్తోంది.ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఈనెల 25న రాబోతోంది.
Ott లో విడుదలయ్యే మూవీలు..
1).w.w.w. మూవీ కంప్యూటర్ బేసిక్ మీద ఈ సినిమాలో తెరకెక్కించడం జరిగింది. ఇందులో కథానాయికగా శివాని రాజశేఖర్ నటించింది. ఇది డైరెక్ట్ గా సోనీ లివ్ లో డిసెంబర్ 24న విడుదల కానుంది.
2). నాగ శౌర్య, రీతువర్మ జంటగా కలిసి నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమా zee-5 లో డిసెంబర్ 24న విడుదల కానుంది.