గోపీచంద్‌కి బాల‌య్య వార్నింగ్‌..తేడా వ‌స్తే ద‌బిడి దిబిడేన‌ట‌!

అఖండ స‌క్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని మాస్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేనితో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఫుల్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలతో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రం ఇటీవ‌లె సెట్స్ మీద‌కు కూడా వెళ్లింది.

అయితే తాజాగా డైరెక్ట‌ర్ గోపీచంద్‌కి బాల‌య్య వార్నింగ్ ఇచ్చాడు. అస‌లేం జ‌రిగిందంటే.. బాల‌య్య ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ప్ర‌సారం అవుతున్న `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఐదు ఎపిసోడ్ల‌ను పూర్తి చేసుకున్న ఈ షోలో మోహ‌న్ బాబు ఫ్యామిలీ, నాని, బ్ర‌హ్మానందం, అనిల్ రావిపూడి, రాజ‌మౌళి, కీర‌వాణిలు గెస్ట్‌లు సంద‌డి చేశారు.

అలాగే అన్‌స్టాప‌బుల్ ఆరో ఎపిసోడ్‌కి పుష్ప టీమ్ రాబోతుండ‌గా.. ఏడో ఎపిసోడ్‌లో మాస్ మ‌హారాజా ర‌వితేజ, గోపీచంద్ మాలినేనిలు గెస్ట్‌లు విచ్చేశారు. అయితే తాజాగా ఏడో ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో బాల‌య్య రావితేజ‌కు ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు సంధించ‌గా.. అన్నిటికీ ఆయ‌న‌ త‌న‌దైన శైలిలో స‌మాధానాలు ఇచ్చారు.

మ‌రోవైపు గోపీచంద్ మలినేని ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను కూడా బ‌య‌ట‌కు లాగిన బాల‌య్య‌.. రవితేజ కు రెండు సూప‌ర్ హిట్స్‌ ఇచ్చావు.. ప్ర‌స్తుతం తనతో చేయబోయే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వ‌కపోతే నిన్ను కొడతానంటూ ఆయ‌న‌కు సరదాగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇప్పుడీ ప్రోమో వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన కొందరు నంద‌మూరి అభిమానులు.. బాల‌య్య‌కు గోపీచంద్ మంచి హిట్ ఇవ్వ‌క‌పోతే ద‌బిడి దిబిడే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Share post:

Latest