మ‌ళ్లీ బాల‌య్య‌తో బ‌న్నీ సంద‌డి..ఇక ఫ్యాన్స్‌కి జాత‌రే జాత‌ర‌!

న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `అఖండ‌` చిత్రం ఇటీవ‌ల విడుద‌లై మంచి విజ‌యం సాధించి భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి స్పెష‌ల్ గెస్ట్‌గా వ‌చ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌.. నంద‌మూరి ఫ్యాన్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నారు. ఇక ఇప్పుడు మ‌ళ్లీ బాల‌య్య‌తో సంద‌డి చేసేందుకు బ‌న్నీ సిద్ధం కాబోతున్నాడు.

ప్ర‌స్తుతం బాల‌య్య ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ప్ర‌సారం అవుతున్న `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఐదు ఎపిసోడ్స్‌ను పూర్తి చేసుకున్న ఈ షో.. ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తోంది. ముఖ్యంగా బాల‌య్య త‌న‌దైన హోస్టింగ్‌తో అద‌ర‌గొట్టేస్తున్నారు.

ఇక ఈ షో ఆరో ఎపిసోడ్‌కి మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని గెస్ట్‌లుగా వ‌చ్చారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 24న టెలికాస్ట్ కానున్నట్లుగా ఇప్పటికే నిర్వహకులు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ డిసెంబ‌ర్ 31కి పోస్ట్ పోన్ అయింది. అందుకు కార‌ణం బ‌న్నీను. ఈయ‌న న‌టించిన తొలి పాన్ ఇండియా చిత్రం పుష్ప డిసెంబ‌ర్ 17న విడుదలైంది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం బ‌న్నీ `పుష్ప` టీమ్‌తో బాల‌య్య షోలో సంద‌డి చేయ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్‌ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న టెలికాస్ట్ కానుంది. మొత్తానికి మ‌ళ్లీ బాల‌య్య‌, బ‌న్నీలు ఒకే స్టేజ్‌గా అటు నంద‌మూరి, ఇటు అల్లు అభిమానుల‌ను అల‌రించ‌బోతున్నారు.

Share post:

Latest