నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్ జంటగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించగా.. జగపతిబాబు, పూర్ణ, సుబ్బరాజు కీలక పాత్రలను పోషించారు.
భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి భారీ కలెక్షన్లను రాబడుతోంది. అఘోరా పాత్రలో బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి డైరెక్షన్, తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. దీంతో రెండు వారంమూ థియేటర్స్ వద్ద అఖండ సందడే కనిపిస్తోంది.
అలాగే ఈ సారి తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ మార్కెట్ లోనూ బాలయ్య ఆరాచకం సృష్టించారు. అవును, అఖండ చిత్రం అక్కడ అన్ స్టాపబుల్ కలెక్షన్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అఖండ ఓవర్సీస్లో 1 మిలియన్ మార్క్ ని అందుకొని.. ఈ ఏడాది అక్కడ మరో బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇక ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసింది చిత్ర యూనిట్. కాగా, బాలయ్య ఈ సినిమా తర్వాత గోపీచంద్ మాలినేనితో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. ఇది పూర్తైన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఓ చిత్రం చేయనున్నాడు.
Happy for My Dear Producers @dwarakacreation ⭐️✨God bless this film Industry ♥️ And All Our Producers . We as a technicians shall Support to Our Fullest And Do Our Best .
Long Live Cinema 🏆 pic.twitter.com/0OxZJ25FbR
— thaman S (@MusicThaman) December 14, 2021