అఖండ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌..బాక్సాఫీస్ వ‌ద్ద బాల‌య్య ఊచకోత‌!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన చిత్రం `అఖండ‌`. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తిబాబు, శ్రీ‌కాంత్‌, పూర్ణ‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజై.. బంప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

మాస్ హీరోగా బాల‌య్య‌ను వెండితెర‌పై ఆవిష్క‌రించ‌డంలో బోయ‌పాటి శ్రీను సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు. రొటీన్ కథనే అయిన‌ప్ప‌టికీ.. అభిమానులకు నచ్చేలా సినిమాను తెరకెక్కించాడు బోయపాటి. అలాగే అఖండ, మురళీ కృష్ణ పాత్ర‌ల‌కు త‌న‌దైనమాస్ న‌ట‌న‌తో, డైలాగ్ డెలివరీతో ప్రాణం పోశారు బాల‌య్య‌.

ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్‌గా 1550 కిపైగా థియేటర్లలో రిలీజైన అఖండ‌.. ఫ‌స్ట్ డే భారీ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టి ఊచ‌కోత కోసింది. సాధారణంగా బాలకృష్ణ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ తక్కువగానే ఉంటుంది. కానీ అఖండ మాత్రం అక్కడ కూడా అద్బుతాలు చేసింది. 2021లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. అలాగే తొలి రోజు అఖండ ఏపీ, తెలంగాణలో రు 15.39 కోట్ల షేర్ వ‌సూళ్ చేసింది.

ఏరియాల వారీగా అఖండ తొలి రోజు వ‌సూళ్లు ఇలా ఉన్నాయి..
నైజాం – 4.39 కోట్లు
సీడెడ్ – 4.02 కోట్లు
ఉత్త‌రాంధ్ర – 1.36 కోట్లు
వెస్ట్ – 96 ల‌క్ష‌లు
గుంటూరు – 1.87 కోట్లు
కృష్ణా – 81 ల‌క్ష‌లు
నెల్లూరు – 93 ల‌క్ష‌లు
——————————————————————
ఏపీ + తెలంగాణ = 15.39 కోట్ల షేర్‌(గ్రాస్‌: 23 కోట్లు)
—————————————————————–