లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలె గప్‌చుప్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈ జంట త్వరలోనే గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే భర్తతో కలిసి ఉండేందుకు తాజాగా నయన్ ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది.
ప్రస్తుతం చెన్నై నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న నయనతార.. అనేక చోట్ల సెర్చ్ చేసి చివరకు రజనీకాంత్, ధనుష్ వంటి సెలబ్రిటీల ఇల్లు ఉన్న పోయస్ గార్డెన్‌లో ఓ ఇంటిని కొనుగోలు చేసిందట. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ ఇంటిలో నాలుగు బెడ్ రూమ్స్ ఉంటాయట.
అయితే ఖరీదైన ఇంటీరియర్‌తో ఆ ఇంటిని మరింత ముస్తాబు చేయిస్తోన్న నయన్.. పెళ్లి తర్వాత భర్త విగ్నేష్‌తో అక్కడే ఉండనుందని ప్రచారం జరుగుతోంది. కాగా, నయనతార సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ భామ చిరంజీవి, మోహన్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న `గాడ్ ఫాదర్` చిత్రంలో నటిస్తోంది.
మలయాళ చిత్రం ‘లూసిఫర్’కు ఇది రీమేక్. ఈ సినిమా షూటింగ్ చక చకా జరగుతోంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందబోయే ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే పలు తమిళ చిత్రాల్లోనూ నటిస్తున్న నయన్.. మరోవైపు భర్త విగ్నేష్ శివన్‌తో కలిసి కొన్ని సినిమాల నిర్మాణంలో భాగమవుతోంది.