గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న సమంత.. ఇటీవల భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టి పెట్టిన సామ్.. ఇటీవలె గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం` చిత్రాన్ని పూర్తి చేసుకుంది. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.
అలాగే తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్` చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో నయన్ మరో హీరోయిన్గా నటిస్తుండగా.. విజయ్ సేతుపతి హీరోగా కనిపించబోతున్నారు. ఇక ఇటీవల తెలుగు, తమిళంలో రెండు బైలింగ్వల్ చిత్రాలను అనౌన్స్ చేసిన సామ్.. ఓ హాలీవుడ్ మూవీని సైతం ప్రకటించింది.
`అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్` అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ ఇంగ్లీష్ చిత్రాన్ని ఫిలిప్ జాన్ అనే హాలీవుడ్ దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోందీ బ్యూటీ.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సామ్ రేర్ ఫీట్‌ను అందుకుంది. సమంత ఇన్ స్టాలో ఏకంగా 20 మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకుంది. ఈ మధ్య కాలంలోనే ఈమె ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగింది. సమంత ఫాలోవర్స్ సంఖ్య 20 మిలియన్ లకు చేరడంతో ఆమె యాడ్ పోస్ట్ రేటు సైతం భారీగా పెరుగుతుందని అంటున్నారు.