సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫస్ట్ టైం తెరకెక్కించిన అతడు మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇందులో కథానాయికగా త్రిష నటించింది. ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం అయితే చాలు మంచి టిఆర్పి రేటింగ్ వస్తూ ఉండడం విశేషం. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మరొకసారి వీరిద్దరి కాంబినేషన్ లోనే విడుదలైన సినిమా ఖలేజా.. ఇందులో కథానాయికగా అనుష్క నటించింది.
కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఘోరపరాజయాన్ని చవిచూసింది. కానీ ఈ సినిమా మాత్రం బుల్లితెరపై మంచి టీఆర్పీ రేటింగ్ సాధించడం గమనార్హం. అలా నిన్ను సంవత్సరాల గ్యాప్ తర్వాత మరొక సారి సూపర్ కాంబో త్వరలోనే రిపీట్ కానుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మాతగా మహేష్ బాబు 28 వ సినిమాగా ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతోంది. ఇందులో కథానాయికగా పూజాహెగ్డే నటించనున్నట్లు గా సమాచారం. సంగీత దర్శకుడుగా థమన్ అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే వెలువడింది.
మహేష్ బాబు మోకాలికి శస్త్రచికిత్స అనంతరం.. కుటుంబ సభ్యులతో కలిసి దుబాయిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక ఈ సందర్భంలోనే వీరందరూ వెళ్లి ఆయనను పలకరించారు. దాంతో ఈ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటో కాస్త వైరల్ గా మారుతోంది.
Work and chill… productive afternoon with the team!! #TrivikramSrinivas @vamsi84 @MusicThaman #Dubai pic.twitter.com/F11xtEM0GW
— Mahesh Babu (@urstrulyMahesh) December 27, 2021