ఎన్నో సంవత్సరాలుగా.. ఎన్నో కష్టాలను అనుభవించిన తరువాత చివరికి మిస్ యూనివర్స్ టైటిల్ ను గెలుచుకున్న అతి కొద్దిమంది మోస్ట్ బ్యూటిఫుల్ మిస్ యూనివర్స్ ల గురించి మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం.
1. సుస్మితాసేన్:
ఫెమినా మిస్ ఇండియా 1984..18 సంవత్సరాల వయసులో 1994 లో ఇండియా బెంగాలీకి చెందిన సుస్మితాసేన్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు మొట్టమొదటిసారి ఇండియా నుంచి మిస్ యూనివర్స్ గా ఎంపికైంది కూడా సుస్మితాసేన్ కావడం గమనార్హం. ఇక ఈమె మోడల్ గా, యాక్ట్రెస్ గా తన కెరియర్ ను కొనసాగిస్తోంది.
2. లారా దత్తా:
మోడల్ గా, ఎంటర్ ప్రెన్యూర్ గా , నటిగా గుర్తింపు తెచ్చుకుని.. ఇంటర్ కాంటినెంటల్ 1997 విన్నర్ గా నిలిచిన లారా దత్తా 2000 లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు భారతదేశం నుండి మిస్ యూనివర్స్ గా గుర్తింపు పొందిన రెండవ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది.
3. హర్నాజ్ సందు:
మిస్ దివా 2021 విన్నర్ గా నిలిచిన ఈమె దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు నిరీక్షణ తర్వాత ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించింది . మూడవ ఇండియన్ మిస్ యూనివర్స్ గా గుర్తింపు తెచ్చుకుంది హర్నాజ్ సందు.
4. ఒకెనా ఫెడ్రోవా :
రష్యాకు చెందిన ఈమె టీవీ ప్రెజెంటర్ గా , సింగర్ గా, యాక్టర్ గా , మోడల్‌గా ఫ్యాషన్ డిజైనర్ గా, బ్యూటీ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె మొదటి సారి రష్యా.. మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. 2002 లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని రష్యా దేశానికి అందించిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది.