ఓకే ఫ్రేమ్ లో పవన్, మహేష్, ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు ఇక పూనకాలే..!

తెలుగు టాప్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు టాప్ హీరోలు ఒకచోట చేరితే అభిమానులకు కన్నుల విందుగా ఉంటుంది. కానీ టాప్ స్టార్స్ అరుదుగా మాత్రమే కలుస్తుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ, సమంత, వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. కాగా తాజాగా ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పార్టిసిపెంట్ గా పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన తాజా ప్రోమో ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇద్దరు టాప్ స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

మహేష్ బాబు పాల్గొన్న ఎపిసోడ్ డిసెంబర్ 2వ తేదీన ప్రసారం కానుంది. కాగా ఈ ఎపిసోడ్ లో మరొక సర్ ప్రైజ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమంలో ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ అనే ఆప్షన్ లో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ తో వీడియో కాల్ లో మాట్లాడతాడనే టాక్ నడుస్తోంది. ఇదే గనుక నిజమైతే అభిమానులనుకు పూనకాలు రావడం ఖాయం. ఒక ప్రేమ్ లో తెలుగు అగ్రహీరోలు పవన్, మహేష్,ఎన్టీఆర్ కనిపిస్తే ఆ సందడే వేరు గా ఉంటుందని ప్రేక్షకులు అంటున్నారు. డిసెంబర్ 2వ తేదీన ప్రసారమయ్యే ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Share post:

Latest