విజయ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్..ఏంటంటే..!

కోలీవుడ్ లో ఇళయదళపతి విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. వరుస బ్లాక్ బస్టర్ లతో నెంబర్ వన్ హీరోగా విజయ్ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం విజయ్ అట్లీ తో ఒక సినిమా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అట్లీ -విజయ్ కాంబినేషన్ లో గతంలో తేరి, మెర్సల్, బిగిల్ సినిమాలు వచ్చాయి.

ఇవి తెలుగులో పోలీసోడు, అదిరింది, విజిల్ పేర్లతో విడుదలయ్యాయి. ఈ సినిమాలు తెలుగులో పెద్దగా సక్సెస్ కాకపోయినా తమిళ్ లో మాత్రం బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దీంతో నాలుగోసారి విజయ్-అట్లీ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో ఇళయదళపతి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం అట్లీ షారుక్ ఖాన్ తో బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత విజయ్ సినిమాకు సంబంధించి స్క్రిప్టు వర్కు పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈసారి విజయ్ తో మాంచి యాక్షన్ సినిమా తీసేందుకు అట్లీ సిద్ధం అవుతున్నాడని సమాచారం. ఇక విజయ్ నెల్సన్ కుమార్ దర్శకత్వంలో బీస్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత విజయ్ తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమా చేయనున్నాడు. ఈ మూవీ పూర్తయిన తర్వాత విజయ్- అట్లీ కాంబినేషన్ లో సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.