న‌మ్మిన‌ వారిని మోసం చేయ‌కు..వెంక‌టేష్‌ సంచ‌ల‌న పోస్ట్‌!

ఇటీవ‌ల `నార‌ప్ప‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న విక్ట‌రీ వెంక‌టేష్.. ప్ర‌స్తుతం దృశ్యం 2, ఎఫ్ 3 చిత్రాలు చేస్తున్నారు. అలాగే మ‌రోవైపు రానా ద‌గ్గుబాటితో క‌లిసి ఓ వెబ్ సిరీస్‌లోనూ న‌టిస్తున్నారు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. ఎప్పుడూ సినిమాల‌కు సంబంధించిన అప్డేట్సే ఇచ్చే వింకీ ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లైఫ్‌ లెసన్స్ కూడా చెబుతున్నారు.

Venkatesh is not interested in Drishyam 2 remake

ముఖ్యంగా మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య-స‌మంత‌లు విడిపోయిన త‌ర్వాత‌.. ప్రేమ‌, న‌మ్మ‌కం, జీవితం వంటి అంశాల‌పై వెంకీ త‌ర‌చూ ఏదో ఒక కొటేషన్‌ పెడుతున్నారు. తాజాగా కూడా `నిన్ను ఇష్టపడిన వాళ్లను ఎప్పుడూ మిస్‌ యూస్‌ చేయకు. నిన్ను కావాలనుకుంటున్న వాళ్లకు బిజీగా ఉన్నానని చెప్పకు. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతారో వాళ్లను ఎప్పుడూ మోసం చేయకు. నిన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకునే వాళ్లని మర్చిపోవద్దు` అంటూ ఇన్‌స్టా స్టోరీలో వెంకీ పోస్ట్ పెట్టారు.

Samantha was ready to have a baby with Naga Chaitanya, reveals Shaakuntalam producer Neelima - Movies News

దీంతో కొంద‌రు నెటిజ‌న్లు చైతు-సామ్‌ల‌కు వెంకీ త‌న కొటేష‌న్స్ ద్వారా ప‌రోక్షంగా హితబోధ చేస్తున్నార‌ని భావిస్తున్నారు. కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ వెంకీ ఇన్‌స్టా పోస్ట్ మాత్రం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Share post:

Latest