నిత్యా మీన‌న్‌ను `లేడీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌` అనే డైరెక్ట‌ర్ ఎవ‌రు..?

నిత్యా మీనన్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అలా మొదలైంది` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి సినిమాతోనే యూత్‌లో సూప‌ర్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ త‌ర్వాత మ‌రిన్ని చిత్రాల‌తో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. నిర్మాతగా మారి చేసిన తాజా చిత్రం `స్కైలాబ్‌’ .

సత్యదేవ్, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి విశ్వక్‌ ఖంతడేరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబ‌ర్ 4న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన నిత్యా మీన‌న్‌.. ఎన్నో విష‌యాల‌ను షేర్ చేసుకుంది. అలాగే తాను ప్ర‌స్తుతం న‌టిస్తున్న `భీమ్లా నాయ‌క్‌` సినిమా విశేషాల‌ను కూడా వివ‌రించింది.

ఇందులో భాగంగానే నిత్యా మీనన్ మాట్లాడుతూ…“త్రివిక్రమ్ శ్రీనివాస్ కాల్ చేసి పవన్ కల్యాణ్‌తో అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్ చేస్తున్నాము.. మీరు ఆ సినిమాలో ఓ పాత్ర చేయాలి. ఇప్ప‌టికే `లేడీ పవన్ కల్యాణ్‌` వచ్చేస్తుంద‌ని పవన్ కల్యాణ్‌కు చెప్పేశాను. మీరు త‌ప్ప‌కుండా ఒప్పుకోవాలి.మీ ఇద్దరి కాంబినేషన్ బాగుంటుంది“ అని ఆయ‌న అన్నారు.

అలా ఈ సినిమా అవ‌కాశం నాకు ద‌క్కింది. అలాగే నేను స్పాంటేనియస్ యాక్టర్‌ని, నా స్వభావానికి తగినట్టుగా భీమ్లా నాయక్ పాత్ర ఉంటుంద‌ని నిత్యా మీన‌న్ చెప్పుకోవ‌చ్చు. ఇక ప‌వ‌న్ గురుంచి మాట్లాడుతూ.. సెట్స్‌లో ఆయ‌న చాలా మౌనంగా ఉంటారు, ఎక్కువగా మాట్లాడరు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నిత్యా కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

 

Share post:

Latest