లేటైనా.. లేటెస్టు హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్స్..!

పనికిమాలిన పనులు పది చేసే బదులు.. పనికొచ్చే పని ఒక్కటి చేస్తే చాలు అంటారు పెద్దలు. అలాగే సినిమా పరిశ్రమలో వరుసబెట్టి సినిమాలు చేసి అపజయాలు మూటగట్టుకోవడం కంటే.. టైం తీసుకున్న హిట్ కొట్టడం బెటర్. సేమ్ ఇలాంటి ఫార్ములానే ఫాలో అవుతున్నారు కొందరు ఫిల్మ్ మేకర్స్. సమయం ఎక్కువ తీసుకున్నా.. మంచి విజయాలు అందుకున్నారు పలువురు దర్శకులు. చాలా కాలం తర్వాత ఈ ఏడాదిలో హిట్ కొట్టిన డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

- Advertisement -

*బొమ్మరిల్లు భాస్కర్‌
తను తీసిన తొలి సినిమా బొమ్మరిల్లు సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఐదేండ్లకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదల చేశాడు. అఖిల్, పూజా హెగ్డే నటించిన ఈ సినిమా ఫర్వాలేదు అనిపించింది. బొమ్మరిల్లు తర్వాత పరుగు, ఆరెంజ్, ఒంగోలు గిత్త సినిమాలు తెరకెక్కించినా జనాలను పెద్దగా ఆకట్టుకోలేదు.

*శ్రీకాంత్‌ అడ్డాల
కొత్తబంగారు లోకం అంటూ 2008లో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు శ్రీకాంత్. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు తీసి హిట్ కొట్టాడు. 2016లో వచ్చిన బ్రహ్మోత్సవం తర్వాత మళ్లీ తాజాగా నారప్ప సినిమా చేశాడు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది.

*గోపిచంద్‌ మలినేని
మాస్ సినిమాల దర్శకుడు గోపీచంద్.. ఈ ఏడాది క్రాస్ సినిమాతో బంఫర్ హిట్ కొట్టాడు. 2010లో డాన్ శీను సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత బాడీగార్డ్, బలుపు, పండగ చేస్కో సినిముల చేశాడు.2017లో వచ్చిన విన్నర్ ఆయన చివరి సినిమా.

*సంపత్‌ నంది
2010లో వచ్చిన ఏమైంది ఈ వేళ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత 2012లో రాంచరణ్ తో కలిసి రచ్చ అనే సినిమా చేశాడు. 2015లో బెంగాల్‌ టైగర్‌, 2017లో గౌతమ్‌ నంద సినిమాలు చేశాడు. నాలుగేళ్ల విరామం తర్వాత గోపీచంద్ తో కలిసి సీటీమార్ అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

*అనుదీప్‌ కేవీ
కరోనా తర్వాత వచ్చిన జాతిరత్నాలు సినిమా జనాలను ఓరేంజిలో అలరించింది. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. 2016లో వచ్చిన పిట్టగొడ అనే సినిమా తర్వాత 5 సంవత్సరాలకు ఆయన ఈ సినిమాను తెరకెక్కించి విజయాన్ని అందుకున్నాడు.

Share post:

Popular